విషయానికి వెళ్లండి

వ్యక్తిగత నివేదిక

ప్రీమియం వేద జాతక నివేదిక

మీ వేద జాతకంపై పూర్తి విశ్లేషణ ఒకే PDFలో. గ్రహస్థానాలు, యోగాలు, దోషాలు, దశల కాలక్రమం, ఏలినాటి శని వివరాలు ఇందులో ఉంటాయి. వివాహం, వృత్తికి సంబంధించిన వర్గ చక్రాలు, మీకు వర్తించే సూచనలు, పరిహారాలు కూడా చూడండి.

₹999

ఒక్కసారి కొనుగోలు · PDF ఇంగ్లీష్‌లో ఉంటుంది · లింక్‌ను ఇమెయిల్‌కు పంపుతాం, మీ ఖాతాలోనూ ఉంటుంది

ప్రీమియం వేద జాతక నివేదిక కొనండి

నివేదికలో ఏముంది?

  • మీ జన్మ జాతకం

    ప్రతి గ్రహం ఏ రాశి, నక్షత్రం, భావంలో ఉందో, దాని డిగ్రీ ఎంతో D1 చక్రంలో చూడండి.

  • లగ్నం, చంద్ర రాశి, జన్మ నక్షత్రం

    మీ లగ్నం, చంద్ర రాశి, చంద్రుడు ఉన్న నక్షత్రం ఏం సూచిస్తాయో తెలుసుకోండి.

  • యోగాలు

    మీ జాతకంలో ఉన్న శుభ యోగాలు ఏవో, ఒక్కో యోగం ఏం సూచిస్తుందో చూడండి.

  • దోషాలు

    మీ జాతకంలో ఉన్న దోషాలు చూడండి. వాటిలో దేనికైనా దోషభంగం వర్తిస్తే ఆ వివరాలూ ఉంటాయి.

  • వింశోత్తరి దశ

    జీవితంలో ఏ దశ ఎప్పుడు నడుస్తుందో చూడండి. ప్రస్తుతం నడుస్తున్న మహాదశ, అంతర్దశ తేదీలు కూడా ఉంటాయి.

  • నవగ్రహాలు

    మీ జాతకంలో ఒక్కో గ్రహం ఉన్న స్థానం ఏం సూచిస్తుందో తెలుసుకోండి.

  • గ్రహ సంయోగాలు, దృష్టులు

    జాతకంలో గ్రహాలు కలిసి ఉంటే లేదా ఒకదానిపై మరొకదాని దృష్టి ఉంటే, ఆ సంబంధాలు ఏం సూచిస్తాయో చూడండి.

  • భావాధిపతులు

    పన్నెండు భావాల అధిపతులు జాతకంలో ఎక్కడున్నారో, ఆ స్థానాలు ఏం సూచిస్తాయో చూడండి.

  • నవాంశం (D9), దశాంశం (D10)

    వివాహం గురించి నవాంశం, వృత్తి గురించి దశాంశం ఏం చెబుతాయో తెలుసుకోండి.

  • ఏలినాటి శని

    జన్మ చంద్రుడి స్థానంతో శని గోచారాన్ని పోల్చి ఏలినాటి శని దశలను నిర్ణయిస్తాం. ప్రస్తుత దశ వర్తిస్తే దాని వివరాలు, రాబోయే దశల తేదీలు చూడండి.

  • మార్గదర్శనం

    జీవితంలోని ఒక్కో అంశం గురించి మీ జాతకం ఏం సూచిస్తుందో చూడండి.

  • పరిహారాలు

    మీ జాతకాన్ని బట్టి వర్తించే రత్నాలు, మంత్రాలు, దానాలు, ఇతర ఆచారాలు.

యోగాలు, దోషాలు, గ్రహ సంయోగాలు, దృష్టుల వివరాలు మీ జాతకంలో అవి ఉన్నప్పుడే ఆయా విభాగాల్లో కనిపిస్తాయి.

ఎలా పొందాలి?

  1. కొనుగోలు చేసేటప్పుడు పుట్టిన తేదీ, సమయం, ప్రదేశం ఇవ్వండి. ‘జనన సమయం తెలియదు’ అని కూడా ఎంచుకోవచ్చు.
  2. ఒక్కసారి చెల్లిస్తే చాలు. చందా లేదు.
  3. నివేదిక సిద్ధమైనప్పుడు డౌన్‌లోడ్ లింక్‌ను మీ ఇమెయిల్‌కు పంపుతాం. మీ ఖాతాలోని ‘నివేదికలు’ విభాగంలో కూడా లింక్ ఉంటుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

పుట్టిన సమయం కచ్చితంగా తెలియకపోయినా ఆర్డర్ చేయవచ్చా?

చేయవచ్చు. పుట్టిన ప్రదేశంలో మధ్యాహ్న సమయాన్ని గణనకు తీసుకుంటాం. అందువల్ల లగ్నం, భావాలు, పుట్టిన సమయంపై ఆధారపడే ఇతర ఫలితాలు సుమారుగా ఉంటాయి.

నాకు ఏం అందుతుంది?

మీ పుట్టిన వివరాలతో రూపొందించిన ఇంగ్లీష్ PDF. మీ జాతకాన్ని బట్టి అందులోని విభాగాలు మారవచ్చు.

ఖాతా అవసరమా?

అవసరం లేదు. ఖాతా లేకుండానే కొనవచ్చు. నివేదిక లింక్ అందుకోవడానికి మీరు వాడే ఇమెయిల్ చిరునామా ఇవ్వండి.

మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. కొనుగోలుకు ఇచ్చిన ఇమెయిల్‌తో సైన్ ఇన్ చేసి ‘నివేదికలు’ తెరవండి. మీ నివేదిక ౩౬౫ రోజులు అందుబాటులో ఉంటుంది.