విషయానికి వెళ్లండి

మీ వేద జాతకం ఆధారంగా రూపొందించే PDF

ప్రేమ, వివాహ నివేదిక

ప్రేమ, భాగస్వామితో బంధం గురించి మీ వేద జాతకం ఏం సూచిస్తుంది? వాటికి సంబంధించిన గ్రహస్థానాలు, దశలు ఈ నివేదికలో చూడండి.

₹799

ఒక్కసారి కొనుగోలు · PDF ఇంగ్లీష్‌లో ఉంటుంది · లింక్‌ను ఇమెయిల్‌కు పంపుతాం, మీ ఖాతాలోనూ ఉంటుంది

ప్రేమ, వివాహ నివేదిక కొనండి

నివేదికలో ఏముంది?

  • మీ జన్మ జాతకం

    మీ వేద జాతకం, విశ్లేషణకు ఆధారమైన గ్రహస్థానాలు.

  • ప్రేమ, భాగస్వామితో బంధం

    ఐదో, ఏడో భావాలు, వాటి అధిపతులు, ఈ భావాలకు సంబంధమున్న గ్రహస్థానాలు ఏం సూచిస్తాయో చూడండి.

  • శుక్రుడు, గురువు, దారకారకుడు

    బంధాలను సూచించే ఈ కారకాలు మీ జన్మ జాతకంలో ఏం చెబుతున్నాయో చూడండి. వర్తిస్తే నవాంశం (D9)లోనూ వాటిని పరిశీలిస్తాం.

  • మీ నవాంశం

    నవాంశ చక్రం (D9), అందులో బంధాలకు సంబంధించిన గ్రహస్థానాలు.

  • కుజ దోషం, బంధాలకు సంబంధించిన యోగాలు

    జాతకంలో కనిపించే కుజ దోషం, యోగాల వివరాలు. కుజ దోషానికి భంగం వర్తిస్తే కారణాలు కూడా చూడండి.

  • దశలు, వాటి తేదీలు

    బంధాలకు సంబంధించిన దశలు, గురువు ఆయా రాశుల్లో ఉండే కాలాలు చూడండి. రెండూ ఒకే సమయంలో ఉంటే ఆ వివరాలూ నివేదికలో చూడొచ్చు.

  • సంప్రదాయ ఆచారాలు

    మీ జాతకాన్ని బట్టి వర్తించే ఆచారాలు, రత్నాల సూచనలు.

ఎలా పొందాలి?

  1. పుట్టిన తేదీ, సమయం, ప్రదేశంతో పాటు సంప్రదింపు, బిల్లింగ్ వివరాలు ఇవ్వండి.
  2. కొనుగోలు చేసేటప్పుడు ధర చూసి చెల్లించండి.
  3. ఆర్డర్‌లో ఇచ్చిన ఇమెయిల్‌కు పంపే సురక్షిత లింక్ ద్వారా PDF డౌన్‌లోడ్ చేసుకోండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

పుట్టిన సమయం కచ్చితంగా తెలియకపోయినా ఆర్డర్ చేయవచ్చా?

చేయవచ్చు. ‘జనన సమయం తెలియదు’ అని ఎంచుకోండి. పుట్టిన ప్రదేశంలో మధ్యాహ్న సమయాన్ని గణనకు తీసుకుంటాం. భావాలు, నవాంశం (D9)లో గ్రహస్థానాలు, పుట్టిన సమయంపై ఆధారపడే తేదీలు సుమారుగా ఉంటాయి.

ఈ నివేదిక ఇద్దరి జాతకాలు పోల్చి చూస్తుందా?

ప్రేమ, వివాహ నివేదిక ఒకరి జాతకాన్ని విశ్లేషిస్తుంది. ఇద్దరి జాతకాలు పోల్చాలంటే ఉచిత జాతక సరిపోలికను వాడండి.

నాకు ఏం అందుతుంది?

మీ జన్మ జాతకం, నవాంశం (D9), కుజ దోష పరిశీలన ఫలితం, బంధాలకు సంబంధించిన కాల సూచనలతో ఇంగ్లీష్ PDF.

మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. కొనుగోలుకు ఇచ్చిన ఇమెయిల్‌తో సైన్ ఇన్ చేసి ‘నివేదికలు’ తెరవండి. మీ నివేదిక ౩౬౫ రోజులు అందుబాటులో ఉంటుంది.

నివేదిక సరిగా అందితే సాధారణంగా డబ్బు తిరిగి ఇవ్వరు. నివేదిక రాకపోయినా, దానిలో వేరొకరి జాతకం ఉన్నా, నివేదిక తెరుచుకోకపోయినా రిఫండ్ విధానం చూడండి. ఏ సందర్భాల్లో రిఫండ్ అడగవచ్చో, ఎలా అడగాలో అందులో ఉంది.